Clay, water, shade. మట్టి, నీళ్లు, నీడ.
There is nothing to switch on. You do four things. ఆన్ చేయాల్సింది ఏమీ లేదు. మీరు చేయాల్సినవి నాలుగే.
Put it in the shade at your farmపొలంలో నీడ ఉన్న చోట పెట్టండి
Near where you stack the crates, on even ground. Away from the sun for most of the day. పెట్టెలు పేర్చే చోట, నేల సమానంగా ఉన్న దగ్గర. రోజులో ఎక్కువ సేపు ఎండ పడని చోట.
Keep water in itనీళ్లు పోస్తూ ఉండండి
Fill it and check it once a day. When the clay dries out, the cooling drops. That is the one job you cannot skip. నింపి, రోజుకి ఒకసారి చూసుకోండి. మట్టి ఆరిపోతే చల్లదనం తగ్గుతుంది. ఈ ఒక్క పని మాత్రం మర్చిపోకూడదు.
Put the day's pick insideఆ రోజు కోసినది లోపల పెట్టండి
Put it in while it is still cool from the morning, not after it has been standing in the sun. Leave a little gap between the crates. పొద్దుటి చల్లదనం పోకముందే లోపల పెట్టండి, ఎండలో నిలబెట్టిన తర్వాత కాదు. పెట్టెల మధ్య కొంచెం ఖాళీ ఉంచండి.
Wait and watch the mandiమండీ చూస్తూ ఆగండి
Now you are not forced to sell on the same day. You get days in hand. What you do with them is up to you. ఇప్పుడు అదే రోజు అమ్మాల్సిన అవసరం ఉండదు. చేతిలో కొన్ని రోజులు ఉంటాయి. వాటిని ఎలా వాడుకోవాలో మీ ఇష్టం.
Why not just buy a fridgeఫ్రిడ్జ్ కొంటే సరిపోదా
Current does not come when you need it. And tomato goes soft inside in deep cold. This cools less than a fridge, and it works as long as there is water. కావాల్సినప్పుడు కరెంటు ఉండదు. పైగా మరీ చల్లగా పెడితే టమాటా మెత్తబడిపోతుంది. ఇది తక్కువ చల్లదనం, నీళ్లు ఉన్నంతసేపు పనిచేస్తుంది.
Potters, by handకుమ్మరులు, చేతితో
Potters make it by hand, the same way they make everything else. Every piece is a little different because a hand made it. A farmer started this, for farmers. కుమ్మరులు చేతితో చేస్తారు, మిగతావన్నీ చేసినట్టే. చేతితో చేసినది కాబట్టి ఒక్కొక్కటి కొంచెం తేడాగా ఉంటుంది. ఒక రైతు మొదలుపెట్టినది, రైతుల కోసం.
Better understood in personనేరుగా చూస్తే అర్థమవుతుంది
Come and see it. We will show you the water, how to load it, and what to expect for your crop.వచ్చి చూడండి. నీళ్లు, ఎలా నింపాలి, మీ పంటకు ఏం ఆశించొచ్చో చూపిస్తాం.